అమరావతి: అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఈ విషయానన్ని రైతులకు, రియల్టర్లు గమనించాలని ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.ఏఎంఆర్‌డీఏపై సీఎం జగన్ గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వివరించారు. 

ఈ ప్రాంత అభివృద్ది బాధ్యత మాది..... ప్రభుత్వం అమరావతికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తుందని ఆయన ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అభివృద్ది చేయాలని గతంలో నిర్ణయించామని ఆయన తేల్చి చెప్పారు.అమరావతిలో పెండింగ్ పనులు పై దృష్టి పెట్టామన్నారు. 

also read:హ్యాపీనెస్ట్ భవనాలు పూర్తి చేయాలి: జగన్ ఆదేశం

తక్షణం పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్టుగా ఆయన గుర్తు చేశారు.అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ లు పూర్తి చేస్తామని చెప్పారు. ఇక్కడ నిర్మించిన భవనాలను వినియోగించుకోవడం కోసం తమ వద్ద ప్రణాళిక ఉందని ఆయన చెప్పారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళతామన్నారు. రాష్ట్రం అభివృద్ది చెందడం చంద్రబాబు కి ఇష్టం లేదన్నారు. ఓటమి చెందినప్పటి నుండి అయన బాధ్యత విస్మరించారన్నారు. బాబు  బాధ్యతను కూడ తామే తీసుకొన్నామని ఆయన తెలిపారు.

వికేంద్రీకరణ చట్టం ఆమోదం పొందగానే విశాఖలో శంఖుస్థాపన చేయాలని భావించినట్టుగా ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం లాంటి కొన్ని దుష్టశక్తులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు.  ఈ కార్యక్రమం ఎట్టిపరిస్థితుల్లో ఆగదని ఆయన స్పష్టం చేశారు.ప్రధానిని ఆహ్వానించడం అనేది సాధారణ అంశమేనని ఆయన తెలిపారు. శంకుస్థాపన కు ప్రధానిని ఆహ్వానించడం సాంప్రదాయమన్నారు.