Asianet News TeluguAsianet News Telugu

తిరుపతిలో రైతుల సభ : మేం రాలేం.. అమరావతి జేఏసీకి సీపీఎం లేఖ

తిరుపతిలో (tirupathi) అమరావతి రైతులు (amaravathi farmers) భారీ బహిరంగసభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు హాజరుకావాలంటూ అన్ని పార్టీల అధ్యక్షులకు అమరావతి జేఏసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. అయితే ఈ సభకు రాలేమని అమరావతి జేఏసీ కన్వీనర్ కు సీపీఎం కార్యదర్శి మధు (cpm madhu) లేఖ రాశారు. 

we can not attent amaravati farmers sabha says cpm
Author
Tirupati, First Published Dec 17, 2021, 2:58 PM IST | Last Updated Dec 17, 2021, 2:58 PM IST

తిరుపతిలో (tirupathi) అమరావతి రైతులు (amaravathi farmers) భారీ బహిరంగసభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు హాజరుకావాలంటూ అన్ని పార్టీల అధ్యక్షులకు అమరావతి జేఏసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. అయితే ఈ సభకు రాలేమని అమరావతి జేఏసీ కన్వీనర్ కు సీపీఎం కార్యదర్శి మధు (cpm madhu) లేఖ రాశారు. సభకు తమను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

అమరావతి నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి ఆటంకంగా ఉన్న బీజేపీతో తాము వేదికను పంచుకోలేమని మధు వ్యాఖ్యానించారు. సభకు రాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. రాజధానిని ముక్కలు చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి చాలా నష్టం చేస్తుందని మధు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనేది సీపీఎం స్టాండ్ అని మధు తేల్చి చెప్పారు.

ALso Read:తిరుపతి సభకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్: ఈ నెల 17న అమరావతి జేఏసీ సభ

కాగా.. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని.అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్రను (nyayasthanam to devasthanam padayatra ) నిర్వహించారు.

దీంతో రైతులు నవంబర్ 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు. 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఈ పాదయాత్ర సాగనుంది. తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగింది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు సాగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా సాగింది. రైతుల పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ.. పార్టీలు మద్దతు ప్రకటించాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios