ప్రత్యేక హోదాతో పాటు, టీడీపీ వైఖరిని నిరసిస్తూ జూలై 24వ తేదీన తలపెట్టిన బంద్‌కు తాము మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు
అమరావతి: ప్రత్యేక హోదాతో పాటు, టీడీపీ వైఖరిని నిరసిస్తూ జూలై 24వ తేదీన తలపెట్టిన బంద్‌కు తాము మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు.బంద్‌లతో జనజీవనం అస్తవ్యస్తం కానుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తోందని ఆయన ప్రకటించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను ఇవ్వనున్నట్టు ఆయన గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తోందని రఘువీరా రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.
బంద్‌లతో ఏపీకి నష్టం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ తలపెట్టిన బంద్‌కు తాము మద్దతివ్వడం లేదని రఘువీరారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు తీసుకొంటున్నట్టు ఆయన చెప్పారు.
