ముద్రగడకు చిత్తశుద్ది లేదన్నా చిన్నరాజప్పఅనుమతి ఇస్తామన్నా ముద్రగడ తీసుకోవడం లేదన్నారు.కాపులకు ముద్రగడే ఇబ్బందన్న చిన్నరాజప్ప.
కాపుల రిజర్వేషన్ పరిష్కారం అవ్వడం ముద్రగడకు ఇష్టం లేదని ఆరోపించారు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ముద్రగడ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నా ఆయన తీసుకోవడం లేదని విరుచుకుపడ్డారు. పాదయాత్రపై, కాపు రిజర్వేషన్లపై ముద్రగడకు చిత్తశుద్ధిలేదని మంత్రి విమర్శించారు.
మంగళవారం చిన్నరాజప్ప మీడియాతో మాట్లాడారు. ముద్రగడకు కాపులను బాగుకోరే ఉద్దేశ్యం లేదని, కేవలం తన ఉనికి కోసం కాపులను ఇబ్బందిపెట్టడమే ముద్రగడ వ్యూహమని విమర్శించారు. కాపుల అభివృద్ది కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ముద్రగడ, వైసీపీ ఇరువురు కలిసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని, వైసీపి ముద్రగడకు వత్తాసు పలుకుతోందని ఆరోపించారు.
చిన్నరాజప్ప బొత్స సత్యానారయణ పై కూడా మండి పడ్డారు. బోత్స అవసరం కోసం పార్టీలు మారుతారని, అలా పార్టీలు మారే బొత్స తమ పార్టీ పై ఆరోపణలు చేసే అధికారం లేదని ఆయన ధ్వజమెత్తారు.
