పేదల సంక్షేమం కోసం రెండేళ్లుగా రాజీలేని ప్రయత్నం: సజ్జల రామకృష్ణారెడ్డి

పేద ప్రజల సంక్షేమం కోసం రెండేళ్లుగా రాజీలేకుండా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 

we are continuing welfare schemes says AP governement Advisor Sajjala Ramakrishna Reddy lns

అమరావతి: పేద ప్రజల సంక్షేమం కోసం రెండేళ్లుగా రాజీలేకుండా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఏపీ రాష్ట్రంలో జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్లు పూర్తైన సందర్భంగా వైసీపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు వైసీపీ నేతలు.  ప్రజా పాలనకు రెండేళ్లు పేరిట తయారు చేసిన ప్రత్యేక కేక్ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

అధికారాన్ని చేపట్టిన రోజు నుండి ప్రతి హామీని నెరవేరస్తున్నామన్నారు. ప్రతి క్షణం పేదల బాగోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్నామని అన్నివర్గాలకు సమానంగా సంక్షేమ ఫలాలు అందించామన్నారు.  20 ఏళ్లలో సాధించలేని అభివృద్దిని రెండేళ్లలో జగన్ చేసి చూపారని ఆయన గుర్తు చేశారు.  వైఎస్ఆర్ చూపిన బాటలోనే సీఎం జగన్ నడిచారన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముందుకే తీసుకొచ్చామన్నారు. నీతి, నిజాయితీతో పాలన సాగిస్తున్నట్టుగా సజ్జల తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి హామీ అమలుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios