గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. నరసరావుపేట పట్టణంలోని శ్రీనివాస గిరిజన కాలనీలో తల్లీ, కొడుకులపై వాలంటీర్ దాడికి పాల్పడ్డాడు. అతని మాట వినలేదని వాలంటీర్‌ మల్లిఖార్జున తమపై దాడి చేశారంటూ బాధితులు ఆరోపించారు.

అతని దాడిలో ఉయ్యాల శివకృష్ణ, అతని తల్లి అంజమ్మ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రగాయాల పాలైన వారిద్దరిని స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం శివకృష్ణ తన ఇంటి ముందు కంచె వేయడంతో వాలంటీర్ మల్లిఖార్జున అతనితో గొడవపడ్డాడు. దీనిపై కేసు నమోదు చేయడంతో మల్లిఖార్జున ఆగ్రహంతో ఊగిపోయి మరోసారి శివకృష్ణపై దాడి చేసినట్లుగా పోలీసులు తెలిపారు. 

Also Read:

వైఎస్సార్ కాలనీలో మహిళా వాలంటీర్ పై దాడి.. గర్భిణి అని కూడా చూడకుండా.

కరోనావైరస్ : వృద్ధులకు అండగా వాలంటీర్లు..ఆగని పెన్సన్ల పంపిణీ..