మళ్లీ కొట్టుకున్న రామసుబ్బారెడ్డి-ఆదినారాయణ రెడ్డి

War Between Adinarayana Reddy and Rama Subba Reddy
Highlights

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. కాంట్రాక్టు విషయంలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గీయులకు, మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు మధ్య ఘర్షణ చోటుకేసుకుంది

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. కాంట్రాక్టు విషయంలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గీయులకు, మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు మధ్య ఘర్షణ చోటుకేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణ రెడ్డి తదనంతర పరిణామాలతో టీడీపీలో చేరారు.

అయితే ఆయన రాకను రామసుబ్బారెడ్డి వ్యతిరేకించడంతో.. వీరిద్దరి మధ్యా రాజీలో భాగంగా మూడేళ్ల తర్వాత కాంట్రాక్టు పనులు రామసుబ్బారెడ్డి వర్గానికి ఇచ్చేలా ఒప్పందం జరిగింది. సమయం గడుస్తున్నా కాంట్రాక్టు పనులు తమకు ఇవ్వడం లేదంటూ రామసుబ్బారెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. సుజలాన్ విద్యుత్ ఉపకేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. 
 

loader