నంద్యాల పట్టణంలో చాలా చోట్ల ‘తప్పు చేసావు బాబు’ అన్న రాతలు గోడలపై కనిపించాయి. దాంతో పార్టీలో, పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అధికార యంత్రాగాన్ని రంగంలోకి దింపారు.  

అసలే ఉపఎన్నికల్లో గెలవటానికి అవస్తలు పడుతున్న టిడిపికి వాల్ రైటింగ్స్ తో మతిపోయినంత పనైంది. నంద్యాల పట్టణంలో చాలా చోట్ల ‘తప్పు చేసావు బాబు’ అన్న రాతలు గోడలపై కనిపించాయి. దాంతో పార్టీలో, పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీ కార్యకర్తలే గోడలపై రాతలను చెరిపేస్తే జనాల్లో నవ్వుల పాలవుతామని నేతలు అనుకున్నారు. అందుకనే వెంటనే అధికార యంత్రాగాన్ని రంగంలోకి దింపారు. చంద్రబాబునాయుడుపై వ్యతిరేక రాతలను చెరిపేయాలన్న ఆతృత పార్టీ నేతలకున్నట్లు అధికార యంత్రాగానికి ఎందుకుంటుంది? అందుకనే యంత్రాంగం నింపాదిగా పనిచేస్తోంది.

ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానండరెడ్డి గెలుపు కోసం చంద్రబాబు ఇప్పటికి రెండుసార్లు నంద్యాల నియోజకవర్గంలో పర్యటించారు. రెండుసార్లూ చంద్రబాబు మాట్లాడిన మాటలు బాగా వివాదాస్పదమయ్యాయి. ఏ స్ధాయిలో వివాదమయ్యాయంటే ఏకంగా జాతీయ మీడియా చంద్రబాబు మాటలపై విరుచుకుపడేంత. ఈ నేపధ్యంలోనే నంద్యాల పట్టణంలో చాలా చోట్ల మంగళవారం నాడు ‘తప్పు చేసావు బాబు’ అనే రాతలు కనబడ్డాయి. ఎవరు రాసారో అర్ధం కావటం లేదు. మొత్తానికి చంద్రబాబు వైఖరితో ఒళ్ళు మండిన జనాలే తమ ఇళ్ళ గోడలపై రాసుకున్నారనే ప్రచారమైతే జరుగుతోంది.