‘వాక్ విత్ జగన్’ సక్సెస్..వైసిపి రికార్డు

Walk with jagan programme a grand success
Highlights

  • జగన్ పిలుపు మేరకు పార్టీ యంత్రాంగం మొత్తం ఒక్కసారిగా కదిలింది.

వైసిపి రికార్డును సృష్టించింది. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సోమవారం వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటుతోంది. ఆ సందర్భంగా జగన్ పిలుపు మేరకు పార్టీ యంత్రాంగం మొత్తం ఒక్కసారిగా కదిలింది.

నెల్లూరు జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం గ్రామంలో వెయ్యి కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశారు. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన 25 అడుగుల స్ధూపాన్ని జగన్ ఆవిష్కరించారు.

ఆ సందర్భంలో పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు వేలసంఖ్యలో రోడ్లపైకి వచ్చి జగన్ కు మద్దతుగా ఎక్కడికక్కడ పాదయాత్ర చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ పాదయాత్రలు జరిగాయి.

అలాగే ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిలు పాదయాత్ర చేశారు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజవకర్గ కేంద్రాలు, 640  మండల కేంద్రాలతో పాటు గ్రామగ్రామాన పాదయాత్రలు జరిగాయి. తమిళనాడు, కర్నాటాక, మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా జగన్ కు మద్దతుగా పలువురు పాదయాత్రలో పాల్గొన్నారు.

వైసిపి ఎన్ఆర్ఐ విభాగం కూడా పాదయాత్రకు ఏర్పాట్లు చేసింది. ఎన్ఆర్ఐ వింగ్ ఆధ్వర్యంలో అమెరికా, బ్రిటన్, యుఏఇ, ఆస్ట్రేలియా, ఖతార్, దుబాయ్, కెనడ, సింగపూర్, షార్జా, మలేషియా దేశాల్లో కూడా వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున వాక్ విత్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

loader