ఏపీలో ఏం జరిగినా వైఎస్‌ జగన్‌పైకి నెట్టివేయడం సీఎం, మంత్రులకు ఫ్యాషన్‌ అయిపోయిందన్నారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి ఘోర పరాజయం తప్పదు’. ఇది రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్య. ఈరోజు మీడియాతో మట్లాడుతూ, ఓటుకు రూ.5వేలు ఇస్తానంటూ స్వయంగా చంద్రబాబే వ్యాఖ్యానించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఏపీలో ఏం జరిగినా వైఎస్‌ జగన్‌పైకి నెట్టివేయడం సీఎం, మంత్రులకు ఫ్యాషన్‌ అయిపోయిందన్నారు.

ప్రపంచ బ్యాంక్‌కు ఎవరో ఉత్తరం రాస్తే దానికి జగనే కారణం అనడం ఎంతవరకూ సమంజసమని నిలదీసారు. ఇక చంద్రబాబు నిర్మిస్తున్నది అమరావతి కాదు..భ్రమరావతిగా వర్ణిచారు. ఏపీలో జరిగిన కుంభకోణాలపై ఐవైఆర్‌ కృష్ణారావుకు పూర్తి అవగాహన ఉందని అభిప్రాయపడ్డారు. విశాఖ భూ కుంభకోణం వివరాలు కూడా ఆయనకు పూర్తిగా తెలుసన్నారు. చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి లోకువ అయ్యారు. ఏపీకి అన్యాయం జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదుని ప్రశ్నించారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బ్రతికుంటే 2011లోపే పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయ్యేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కడుతున్నది పోలవరం ప్రాజెక్ట్‌ కాదు కేవలం కాపర్‌ డ్యాం మాత్రమే అని స్పష్టం చేసారు. 2018లోపు పోలవరం నిర్మాణం అసాధ్యమన్నారు.

గత 25 ఏళ్లలో గోదావరి నదిలో జూన్ మాసంలో మిగులు జలాలు ఏనాడూ లేవన్న విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి ఐవైఆర్‌ కృష్ణారావును రాజీనామా కోరి ఉంటే బాగుండేదన్నారు. ఐవైఆర్ తొలగింపులో ఐవైఆర్‌ కన్నా చంద్రబాబుకే వందరెట్లు నష్టం జరిగిందని చెప్పారు. సోషల్‌ మీడియకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసారు.