కాల్‌మనీ వేధింపులు: కృష్ణా జిల్లాలో వీఆర్‌ఓ ఆత్మహత్య
కృష్ణా జిల్లాలోని కొండపల్లిలోని తన నివాసంలో వీఆర్వో గౌస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్ మనీ వేధింపుల కారణంగానే గౌస్ ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు చెప్పారు.
విజయవాడ: కాల్‌మనీ వేధింపులు తాళలేక వీఆర్వో ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడిని ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్‌గా గుర్తించారు. కొండపల్లి గ్రామ వీఆర్వోగా Gouse విధులు నిర్వహిస్తున్నారు. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం వీఆర్వో కొంత అప్పు చేశారు. వడ్డీ money చెల్లిస్తున్నప్పటికీ లక్షల్లో అప్పులు ఉన్నట్టు Call money మాఫియా వేధింపులకు గురి చేసిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ Harassment భరించలేక గౌస్ సూసైడ్ లెటర్ వ్రాసి kondapalliలోని అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ మాఫియాకు సంబంధించి పలు ఘటనలు చోటు చేసుకొన్నాయి. తీసుకొన్న డబ్బుల కంటే అధిక మొత్తంలో వడ్డీలు చెల్లించినా కూడా వడ్డీ మాఫియా వేధింపులకు గురి చేయడంతో పలువురు ఆత్మహత్య చేసుకొన్నారు. మరికొందరు పోలీసులను ఆశ్రయించారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో కాల్ మనీ వేధింపుల విషయమై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వడ్డీ వ్యాపారులకు టీడీపీ సర్కార్ పరోక్షంగా అండగా నిలుస్తోందనే విమర్శలు గుప్పించింది.
also read:కాల్‌మనీ వ్యాపారం చేస్తా.. అడ్డొస్తే బ్లేడ్‌తో పీక కోస్తా.. టీడీపీ నాయకుడి బెదిరింపు...
ఎక్కువ మొత్తం వడ్డీకి వ్యాపారులు అప్పులు ఇస్తుంటారు. డబ్బులు తీసుకొన్న వారి నుండి పీడించి డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులు సకాలంలో చెల్లించకపోతే అవమానాలకు గురిచేస్తారు. ఇంటి వద్దకు వచ్చి వేధింపులకు గురి చేస్తారు. అప్పులు తీసుకొన్న వారి కుటుంబసభ్యులను వేధింపులకు గురి చేస్తారు. కుటుంబ సభ్యులపై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు కూడా గతంలో చోటు చేసుకొన్నాయి. ప్రభుత్వాలు మారినా కూడా కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలు మాత్రం ఆగలేదు. తాము చెల్లించిన డబ్బులను రాబట్టుకొనేందుకు వ్యాపారులు వేధింపులకు గురి చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్, గుంటూరు, కృష్ణా జిల్లాలో కాల్‌మనీ వేధింపులకు సంబంధించి గతంలో కేసులు నమోదయ్యాయి. గతంలో కర్నూల్ జిల్లాలోని బనగానపల్లె మండలం బీరవల్లిలో కాల్ మనీ వేధింపుల కారణంగా రామాంజనమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకొంది. రామాంజనమ్మ అనే మహిళకు పెద్ద మద్దయ్య కుటుంబం రూ. 2 లక్షలు అప్పు ఇచ్చింది. రెండేళ్ల వరకు ఆమె నుండి వడ్డీ కానీ, అసలుు కానీ వసూలు చేయలేదు. అయితే రెండేళ్ల తర్వాత అసలు, వడ్డీ కలిపి రూ.. 11 లక్షలు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రతి నెల వడ్డీ కోసం ఆమెను వేధించారు. అంతేకాదు బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయమై బాధితురాలుపోలీసులను ఆశ్రయించింది. కానీ పోలీసులు కూడ స్పందించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిందని బాధితురాలిని బెదిరించారు. ఈ బెదిరింపులు తట్టుకోలేక ఆమె 2020 మార్చి 11న ఆత్మహత్యకు పాల్పడింది.ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.