Asianet News TeluguAsianet News Telugu

కాల్‌మనీ వ్యాపారం చేస్తా.. అడ్డొస్తే బ్లేడ్‌తో పీక కోస్తా.. టీడీపీ నాయకుడి బెదిరింపు...

మీడియా ముసుగులో ‘కాల్‌మనీ గురించి విచారణ చేస్తే పీక కోస్తా’ అంటూ ఓ విలేకరిని బెదిరించాడో టీడీపీ నాయకుడు. దీనిపై బాధిత విలేకరి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. 
 

TDP leader gade srinivasrao supports call money gang in tadepalli - bsb
Author
Hyderabad, First Published Dec 31, 2020, 11:10 AM IST

మీడియా ముసుగులో ‘కాల్‌మనీ గురించి విచారణ చేస్తే పీక కోస్తా’ అంటూ ఓ విలేకరిని బెదిరించాడో టీడీపీ నాయకుడు. దీనిపై బాధిత విలేకరి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. 

ఉండవల్లిలో అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం, నూటికి వారానికి పది నుంచి పదిహేను రూపాయల  వసూలు చేస్తున్నారని సమాచారంతో ఓ టీవీ చానల్‌ విలేకరి సాయి సందీప్‌ వివరాలు సేకరించేందుకు ప్రయత్నించాడు. దీంతో టీడీపీ ఉండవల్లి అధ్యక్షుడు గాదె శ్రీనివాసరావు చెప్పడానికి వీల్లేని విధంగా ఫోన్‌చేసి బూతులు తిట్టాడు. 

‘కాల్‌మనీ వ్యాపారం చేస్తాను. చేసేవాళ్లకు కూడా అండగా ఉంటాను. అయితే ఏంటి? నువ్వు జోక్యం చేసుకుంటే అర్ధరూపాయి బ్లేడ్‌తో పీకకోస్తా ’ అంటూ బెదిరించడంతో బాధితుడు సందీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదిలా ఉండగా మరో కేసులో తాడేపల్లి పట్టణ పరిధిలో, విజయవాడలో కాల్‌మనీ వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరిని తాడేపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నులకపేటకు చెందిన అర్చకుడు కృష్ణతేజ విజయవాడ ఒన్‌టౌన్‌కు చెందిన అన్నదమ్ములు దుక్కా వేణు, దుక్కా శ్రీను వద్ద రూ.2 లక్షలకు చిట్టీ వేసి ముందుగానే పాడుకున్నాడు. 

డబ్బులు చెల్లించకపోవడంతో అన్నదమ్ములు ఇద్దరూ రూ.5లక్షలు చెల్లించాలని కృష్ణతేజపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఖాళీచెక్కులు, ప్రామిసరీ నోటులు తీసుకున్నారు. వారి బాకీ తీర్చేందుకు నులకపేటకు చెందిన ఝాన్సీ దగ్గర కృష్ణతేజ రూ.75 వేలు, విజయవాడ ఒన్‌టౌన్‌కు చెందిన లక్ష్మి వద్ద కూడా అప్పుచేశారు. 

ఝాన్సీ, లక్ష్మి కూడా కృష్ణతేజ వద్ద ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్‌లు తీసుకుని చెరో రూ.5 లక్షలు చెల్లించాలని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వడ్డీ వ్యాపారుల నుంచి ఆరు ఖాళీ ప్రామిసరీ నోట్లు, మరో నాలుగు ఖాళీ చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకుని, వారిని కోర్టుకు హాజరు పరిచినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios