Asianet News TeluguAsianet News Telugu

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం: జాతీయ స్థాయిలో నిరసనకు నిర్ణయం, కార్యాచరణ ఇదే

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు ఆందోళనను తీవ్రతరం చేశారు. దీనిలో భాగంగా భవిష్యత్ కార్యాచరణను వారు ప్రకటించారు. ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. 
 

vizag steel plant protests schedule ksp
Author
Visakhapatnam, First Published Jul 12, 2021, 2:46 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రంగా వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో అడ్డుకునేందుకు కార్మిక, ప్రజా సంఘాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇకపై జాతీయ స్థాయిలో ఉద్ధృతంగా ఉద్యమాన్ని నడపాలని కార్మికులు నిర్ణయించారు. దీనిలో భాగంగా భవిష్యత్ కార్యాచరణను వారు ప్రకటించారు. ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మండలాల వారీగా ఉద్యమ కమిటీలను ఏర్పాటు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 21, 22న అన్ని పార్లమెంటరీ పార్టీల నేతలను కలవనున్నారు. 

Also Read:విశాఖ స్టీల్ ప్లాంట్‌‌పై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీపీఐ ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. జూలై నెలాఖరున భారీగా ఉద్యమాలు, నిరసనలు చేపట్టాలని తీర్మానించారు. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతై.. 150 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సోము వీర్రాజు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం జగన్ కూడా నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని రామకృష్ణ కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios