విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాదన్నారు.ఈ బాధ్యతను తమ పార్టీ తీసుకొంటుందని చెప్పారు. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరించవద్దని కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నారు.
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి100 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పలు రాజకీయపార్టీలను కలిసి స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.
రాష్ట్రంలోని ఎంపీలను కలిసి పార్లమెంట్ లో ఈ విషయాన్ని లేవనెత్తాలని అఖిలపక్ష జేఏసీ కోరుతోంది. అయితే ఈ సమయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫ్యాక్టరీ ప్రైవేటీకరించకుండా కాపాడే బాధ్యతను బీజేపీ ఏపీ శాఖ తీసుకొంటుందని ప్రకటించారు.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించవద్దని ఏపీ ప్రభుత్వం కూడ కేంద్రాన్ని కోరింది.ఈ విషయమై అసెంబ్లీలో తీర్మానం కూడ చేశారు అఖిలపక్ష బృందాన్ని కూడ కేంద్రం వద్దకు తీసుకెళ్లడానికి ఏపీ సర్కార్ సిద్దంగా ఉంది. కానీ ఈ విషయమై కేంద్రం నుండి సానుకూల స్పందన రాలేదు.ఢిల్లీకి వెళ్లిన సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కేంద్రాన్ని కోరామని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఉమ్మడి ఏపీ వాసులు పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించారు.