చెప్పడం కాదు చేసి చూపించాలి అనేదానికి నిదర్శనంగా నిలిచారు ఓ తహశీల్దార్. స్వయంగా తన కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి సామాన్యజనానికి ప్రభుత్వ పాఠశాలలమీద నమ్మకాన్ని పెంచారు. 

కృష్ణాజిల్లా విస్సన్నపేట తహశీల్దార్ మురళీకృష్ణ కుమార్తె సంజన. ఈ చిన్నారి గతేడాది ఓ టెక్నో స్కూలులో ఒకటో తరగతి చదువుకుంది. ప్రస్తుతం ఈ చిన్నారి రెండో తరగతిలో ప్రభుత్వ పాటశాలలో చేరింది. 

మురళీకృష్ణ స్వయంగా కూతురిని కారులో తీసుకువచ్చి ఎంపీయూపీ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. తహశీల్దార్ నిర్ణయంపై స్కూలు టీచర్లు ప్రశంసలు కురిపించారు. ఈ విషయం తెలిసిన స్థానికులు కూడా తహశీల్దార్ ను అభినందిస్తున్నారు.