విశాఖపట్టణం: ఏపీలో బీజేపీకి ఒక్క  ఎంపీ స్థానం కూడ రాదని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు తేల్చి చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు.

సోమవారం నాడు బీజేపీ నేత విష్ణకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో బీజేపీకి మూడు అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని ఆయన జోస్యం చెప్పారు. తనపై పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు కూడ ఓటమి పాలయ్యే అవకాశం ఉందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

బెంగాల్ రాష్ట్రంలో ఈ దఫా బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన  అభిప్రాయపడ్డారు. బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడంతో  బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన విమర్శించారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలనే వారి కలలు కల్లలుగా మారాయని విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు.