గొంతు కోసి బాలుడి హత్య.. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి..
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మైనర్ బాలుడి గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు.

విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో హత్య ఘటన కలకలం రేపింది. బాలుడి మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన బాలుడ్ని స్థానిక భజన కోవెలవీధి నివాసిగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక భజన కోవెలవీధికి చెందిన మైలపల్లి చిన్నా అలియాస్ విస్కీ (17)ని గొంతు కోసి హత్య చేశాడు. మైనర్ బాలుడి చంపిన అనంతరం సముద్రంలో పడేసినట్లు తెలిపారు. మైనర్ బాలుడ్ని గొంతుకోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమ కొడుకు ఎవరితో విభేదాలు లేవని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. మైనర్ బాలుడ్ని గొంతు కోసిన అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి.. ఫిషింగ్ హార్బర్ జెట్టి నంబర్ 11 సమీపంలో సముద్రంలోకి విసిరేసినట్టు పోలీసులు గుర్తించారు.