అనకాపల్లిలో కూలిన బ్రిడ్జి పిల్లర్: నిర్మాణసంస్థతో పాటు మరో ఇద్దరిపై కేసు
అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లర్ కూలిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లర్ కూలి రాహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది.
విశాఖపట్టణం: అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లర్ కూలిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లర్ కూలి రాహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఓ కారులో ప్రయాణీస్తున్న ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం నాడు సాయంత్రం చోటు చేసుకొంది.
also read:విశాఖలో ఘోర ప్రమాదం: కుప్పకూలిన బ్రిడ్జ్, నుజ్జునుజ్జయిన కార్లు.. ఇద్దరి మృతి
ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టిన దిలీప్ బిల్డ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సైట్ ఇంచార్జీ ఈశ్వరరావు, సైట్ జనరల్ మేనేజర్ నాగేందర్ కుమార్ లపై పోలీసులు కేసు పెట్టారు. బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీస రక్షణ చర్యలు కూడ తీసుకోకుండా నిర్మాణం చేపట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు విమర్శిస్తున్నారు.