విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను (steel plant privatisation) నిరసిస్తూ స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఇవాళ విశాఖ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో భాగంగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను (steel plant privatisation) నిరసిస్తూ స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఇవాళ విశాఖ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో భాగంగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. బంద్‌ను విజయవంతం చేయాలంటూ ప్రజాసంఘాలు ర్యాలీ చేపట్టాయి. మద్దిలపాలెం కూడలి వద్ద అఖిలపక్ష నేతలు నిరసన తెలుపుతున్నారు. జాతీయ రహదారిని నిర్బంధించి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాని మోడీ, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గాజువాక నుంచి సీపీఎం నేతలు, కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి

విశాఖ స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాల నేతలు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ పిలుపు నేపథ్యంలో.. విశాఖలో పలు విద్యా సంస్థలు స్వచ్ఛంద బంద్‌లో పాల్గొన్నాయి. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి.