Asianet News TeluguAsianet News Telugu

విశాఖ శారదా పీఠం ఓ డూప్లికేట్.. ఉత్తరాదిలో అయితే తరిమికొడతారు: గోవిందానంద విమర్శలు

హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవమన్నారు హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి. చాలా హడావుడిగా తిరుమల తిరుపతి దేవస్థానం తన ప్రకటనను వెలువరించిందని ఆయన విమర్శించారు. వారు చెపుతున్న మాటలు నమ్మదగినవి కాదని సరస్వతి అన్నారు.

visakha sarada peetam is duplicate says govindananda saraswathi ksp
Author
Amaravathi, First Published Jun 4, 2021, 4:09 PM IST

హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవమన్నారు హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి. చాలా హడావుడిగా తిరుమల తిరుపతి దేవస్థానం తన ప్రకటనను వెలువరించిందని ఆయన విమర్శించారు. వారు చెపుతున్న మాటలు నమ్మదగినవి కాదని సరస్వతి అన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీటీడీ అధికారులు తప్పులపై తప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. తొలుత జపాలి తీర్థంలో హనుమంతుడు పుట్టాడని చెప్పారని... ఆ తర్వాత ఆకాశగంగ ప్రాంతంలో పుట్టాడని చెప్పారని... క్షణానికి ఒక మాట మార్చడం క్షమించలేని నేరమని ఆయన పేర్కొన్నారు. 

Also Read:అసంపూర్ణ జ్ఞానం, బుర్రలేని రాతలు.. టీటీడీపై విరుచుకుపడ్డ గోవిందానంద సరస్వతి...

టీటీడీ ఇప్పటికైనా శంకర, మధ్వ, రామానుజ తీర్థ మఠాల పెద్దలను సంప్రదించాలని గోవిందానంద సూచించారు. ఈ అంశంపై విశాఖ శారదాపీఠం సలహాలు ఇస్తోందనే వార్తలపై ఆయన స్పందిస్తూ... ఆ పీఠం ఒక డూప్లికేట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం మద్దతు ఉన్నంత మాత్రాన విశాఖ పీఠం శంకర పీఠం అవుతుందా? అని మండిపడ్డారు. దక్షిణ భారతంలో తప్పుడు పీఠాలు ఉన్నాయని... ఇలాంటి పీఠాలను ఉత్తరాదిలో తరిమికొడతారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శృంగేరి, బద్రి, ద్వారక, పూరి, కంచి పీఠాలు మాత్రమే శంకర పీఠాలని గోవిందానంద స్పష్టం చేశారు. సన్యాసులు రాజకీయాల్లోకి రాకూడదని ఆయన హితవు పలికారు. 

టీటీడీ ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్న హనుమాన్ జయంతికి, ఇప్పుడు నిర్వహిస్తున్న తేదీలకు పొంతనే లేదని గోవిందానంద విమర్శలు గుప్పించారు. హనుమంతుడి జన్మస్థలం గురించి టీటీడీ రాత్రికి రాత్రే కలగనిందా? అని ప్రశ్నించారు. టీటీడీ తప్పు చేసిందని, ఇప్పటికైనా అహంకారాన్ని వదలాలని.. లేకపోతే పరువు పోతుందని హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios