అసంపూర్ణ జ్ఞానం, బుర్రలేని రాతలు.. టీటీడీపై విరుచుకుపడ్డ గోవిందానంద సరస్వతి...
టీటీడీ మీద గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పుస్తకంలో అన్నీ తప్పులేనని తోసిపుచ్చారు. సంపూర్ణ అవగాహన, పరిశోధన చేయకుండా హనుమంతుడి జన్మస్థలాన్ని అసంపూర్ణ జ్ఞానంతో ప్రకటించారని తప్పుబట్టారు. టీటీడీ ప్రమాణంగా చూపిస్తున్న.. వెంకటాచలం మహత్యం సంకలనం తప్పుల తడక అని కొట్టిపారేశారు.

వెంకటాచలం మహత్యం బుర్రలేని వారు రాశారని మండిపడ్డారు. ద్వాపరయుగం అంతంలో 5వేల యేళ్ల క్రితం పురాణాలు పుట్టాయని, టీటీడీ రామాయణాన్ని ప్రమాణంగా తీసుకోవడం లేదని గోవిందానంద విమర్శించారు. హనుమంతుడు పుట్టిన శ్లోకంతో తిధికి సంబంధం లేదన్నారు.
కలియుగంలో హనుమంతుడు పుట్టినట్టు టీటీడీ పుస్తకం చెబుతోందని, టీటీడీ ప్రకారం హనుమంతుడు రాక్షసుడు, రామాయణం ప్రకారం అప్సరస బిడ్డ అని తెలిపారు. అంజన హళ్లి ఇంకా పంపా సరోవరం వద్ద ఉందని పేర్కొన్నారు. రామాయణంలో ఎక్కడా తిరుమల గురించి వృషాద్రి, శేషాద్రి పర్వతాలు లేవని చెప్పారు.
కొందరు కీర్తి కోసం వత్తిడితో హనుమంతుడి జన్మస్థలాన్ని పండితుల చేత రిలీజ్ చేయించారని ఆరోపించారు. టీటీడీ పండితులు దారి తప్పారని, తిరుమలను హనుమంతుడి జన్మస్థలం అని ప్రకటించాక.. టీటీడీకి లాయర్ నోటీసులు వెళ్లాయని గోవిందానంద తెలిపారు.