"చంపేస్తా ..": ఎంపీ రఘురామ కృష్ణరాజుకి విశాఖ ఎంపీ ఎంవీవీ వార్నింగ్
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై విశాఖ ఎంపీ ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు, తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై స్పీకర్, హోం మంత్రిత్వ శాఖకు రఘురామ లేఖ రాయడంపై ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో వైసీపీ ఎంపీ ఎంవీవీ అసభ్య పదజాలంతో దూషించారు. ఇటీవల ఎంవీవీ కుటుంబసభ్యులను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై లోక్ సభ స్పీకర్ కు రఘురామ లేఖ రాయడంపై ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబం గురించి .. నువ్వు ఏవిధంగా లేఖ రాస్తావని రఘురామపై ఎంవీవీ మండిపడ్డారు. చంపేస్తాంటూ ఇతర ఎంపీల ముందు బెదిరించినట్టు సమాచారం.
‘నువ్వెవడివి నా కుటుంబం గురించి లేఖ రాయడానికి?’ అంటూ ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పక్కనే మరో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. కానీ, ఎంవీవీ తిడుతున్నంత సేపు ఆయన మౌనంగానే ఉన్నారు. ఎంవీవీ తిడుతుంటే.. రఘురాజు కూడా మౌనంగా ఉండిపోయారు. ఆ అనంతరం ఈ ఘటనపై రఘురాజు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘురామను బెదిరించిన వైసీపీ రెండో ఎంపీ ఎంవివి సత్యనారాయణ. గతంలో కూడా పార్లమెంట్ 4వ నెంబర్ గేట్ సమీపంలో ‘చంపేస్తా’ అంటూ... రఘురామను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించిన విషయం తెలిసిందే.