విశాఖపట్నంలో సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు, అడిటర్ లను కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. 

విశాఖపట్నం : ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆయన భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీలను కిడ్నాపర్లు అపహరించారు. ఈ రోజు ఉదయం రిషికొండ లోని ఆయన ఇంట్లోకి దూరిన దుండగులు వీరిని కిడ్నాప్ చేశారు. ఉదయం 6-7 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఈ సమయంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హైదరాబాద్ లో ఉన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఉదయం ఎంపీ ఇంటికి చేరుకున్న దుండగులు సీతమ్మధారలో ఉన్న జీవీకి ఎంపీ భార్యతో ఫోన్ చేయించారు. ఆయన వచ్చాక ముగ్గురిని అపహరించారు. ప్రధానంగా రౌడీ షీటర్ హేమంత్ అనే అతని మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీవీ అనేక కంపెనీలకు అడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆ కంపెనీలకు అడిటర్ గా జీవీ వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాపార గొడవలే కిడ్నాప్ కు కారణమా? అనే కోణంలోనూ ఆలోచిస్తున్నారు. అయితే, దీనిమీద పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కిడ్నాప్ అయిన సమాచారం మాత్రమే వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇటీవలే రుషికొండలో కొత్త ఇల్లు కట్టుకుని అందులోకి మారారు సత్యనారాయణ. అధికార పార్టీ ఎంపీ భార్య, పిల్లలు కిడ్నాప్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా రౌడీ షీటర్ హేమంతో మీద ఇది వరకు రౌడీషీట్ కూడా ఉంది. ఆయన పాత్ర ఎంత వరకు ఉందనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు గాలింపు చేస్తున్నారు.