వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చిన విశాఖ గర్జన ర్యాలీ చేపట్టింది. ఎల్‌ఐసీ భవనం సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన విశాఖ గర్జన ర్యాలీ.. బీచ్ రోడ్డులోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు కొనసాగింది.
వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చిన విశాఖ గర్జన ర్యాలీ చేపట్టింది. ఎల్‌ఐసీ భవనం సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభమైంది. అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన నాయకులు.. గర్జన ర్యాలీని ప్రారంభించారు. బీచ్ రోడ్డులోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల మేర విశాఖ గర్జన ర్యాలీ సాగింది. అక్కడ నాయకులు వైస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు.
ఈ ర్యాలీలో స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు, ఉత్తరాంధ్ర వైసీపీ ప్రజాప్రతినిధులు, పలు వర్గాలకు చెందినవారు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. నగరంలో వర్షం కురుస్తున్నప్పటికీ.. విశాఖ గర్జన ర్యాలీ కొనసాగుతుంది. విశాఖ గర్జన ర్యాలీలో పాల్గొన్న వారంతా.. విశాఖకు రాజధాని రావాలంటూ నివాదాలు చేశారు. మూడు రాజధానులతో రాష్ట్రం మొత్తం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. అయితే లక్ష మందికిపైగా ఈ ర్యాలీలో పాల్గొంటారని నాన్ పొలిటికల్ జేఏసీ భావించినప్పటికీ.. ఆ స్థాయిలో ప్రజలు పాల్గొనలేదని తెలుస్తోంది. వర్షం కూడా ఇందుకు ఒక కారణంగా తెలుస్తోంది.
విశాఖ గర్జన ర్యాలీలో పాల్గొన్న మంత్రి రోజా.. టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వికేంద్రీకరణను టీడీపీ అడ్డుకుంటుందని విమర్శించారు. చంద్రబాబు నాయుడకు పవన్ కల్యాణ్ బినామీ అని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడూ సమస్యల్లో ఉన్న పవన్ రంగంలోకి దిగుతాడని విమర్శించారు. కలెక్షన్లు, సినిమా షూటింగ్స్ చేయడానికి వైజాగ్ కావాలి.. కానీ రాజధానిగా విశాఖ పనికి రాదా? అని ప్రశ్నించారు.
