రాష్ట్రంలో  పెరిగిపోతున్న వైరల్‌ జ్వరాలు

Viral fever rampant in the state
Highlights

  • కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల కోసం ఇలా క్యూ కట్టారు.
  • ఒక్క కాకినాడలోనే కాదు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్ధితి.
  • రాష్ట్రంలోని ఏ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్ళినా జ్వరాల బారిన పడిన జనం బారులు తీరి కనిపిస్తున్నారు.
  • ప్రభుత్వాస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రులు కూడా జ్వర బాధితులతో కిటకిటలాడిపోతున్నాయి.

వీళ్ళంతా ఎవరునుకుంటున్నారా? రుణాల కోసమో, ఫించన్ల కోసమో, మరేదో సంక్షేమ పథకాల కోసమో బారులు తీరిన జనం కాదు. జ్వరమో రామచంద్రా అంటూ వైద్యం కోసం ఆసుపత్రిలో బారులు తీరిన జనాలు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల కోసం ఇలా క్యూ కట్టారు. ఒక్క కాకినాడలోనే కాదు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్ధితి. రాష్ట్రంలోని ఏ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్ళినా జ్వరాల బారిన పడిన జనం బారులు తీరి కనిపిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రులు కూడా జ్వర బాధితులతో కిటకిటలాడిపోతున్నాయి.

 

ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే మూడు వేలమందికి పైగా జ్వరాల బారిన పడ్డారని సమాచారం. కడపలో 238 మలేరియా కేసులతో పాటు, 1800 జ్వరాల కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో ఆగస్టు నెలలోనే 165 డెంగ్యూ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికీ డెంగ్యూతో చికిత్స కోసం రోగులు వస్తూనే ఉన్నారు.  

 

ఇక మన్యం పరిస్థితి అయితే చెప్పనవసమే లేదు. రాష్ట్రమంతా విషజ్వరాలు వ్యాపిస్తున్నా ప్రభుత్వ స్పందన మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. 'దోమలపై యుద్ధం' అంటూ ఆమధ్య ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబునాయుడు తర్వాత ఆ మాటే మరచిపోయారు. అధికారులూ పట్టించుకోకపోవడంతో జ్వరాలు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి.

 

మైదానం, మన్యం అనే తేడా లేకుండా మామూలు జ్వరాలతో పాటు విషజ్వరాలు కుడా విజృంభిస్తున్నాయ్. మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ జ్వరాలు చాలా చోట్ల బయటపడుతున్నాయి. గ్రామీణం, పట్టణం అనే తేడా లేకుండా మురికికూపాలుగా మారడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు దోమలు విజృంభణ, కలుషిత నీరు తదితరాల వల్ల జ్వరాలు పెరిగిపోతున్నాయి.                       

loader