నన్ను అంతమొందించి గెలవాలనే యత్నం: వినుకొండ ఘర్షణలపై ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు
తనను అంతమొందిస్తే వినుకొండలో సులభంగా విజయం సాధించవచ్చని టీడీపీ భావిస్తుందని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చెప్పారు.
గుంటూరు:తనపై టీడీపీ శ్రేణులు దాడికి దిగినట్టుగా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెప్పారు.
వినుకొండలో గురువారంనాడు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘర్షణ తర్వాత ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడారు. టీడీపీ శ్రేణుల దాడిలో తన గన్ మెన్ కు గాయాలయ్యాయని ఆయన చెప్పారు.
వినుకొండలో వైసీపీ నేతలను చంపాలని టడీపీ చూస్తుందని ఆయన ఆరోపించారు. తనపై దాడిలో 400 మంది వరకు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారని ఆయన చెప్పారు. తనను అంతమొందించి వినుకొండలో విజయం సాధించాలని టీడీపీ ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆరోపించారు. అధికారం కోసం టీడీపీ అల్లర్లు సృష్టిస్తుందన్నారు. తనను అడ్డు తొలగించుకొంటే వినుకొండలో సులభంగా విజయం సాధించవచ్చని టీడీపీ అభిమతంగా ఉందని బ్రహ్మనాయుడు ఆరోపించారు.
ఇవాళ వినుకొండలో టీడీపీ , వైఎస్ఆర్‌సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తాము చేస్తున్న ర్యాలీని వైఎస్ఆర్‌సీపీ వర్గీయులు అడ్డుకున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు.ఈ ఘర్షణను నివారించేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులకు దిగారు.
also read:వినుకొండలో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ:పోలీసుల కాల్పులు
గత కొంతకాలంగా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణ, మట్టి అక్రమ రవాణా విషయమై ఇద్దరు నేతల మధ్య ఆరోపణలు చోటు చేసుకున్నాయి.