విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే దారి తప్పాడు. పిల్లలకు క్రమ శిక్షణ నేర్పించాల్సిందిపోయి.. తన వక్రబుద్ధి బయటపెట్టాడు. కూతురులాంటి వయసు ఉన్న విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. దీంతో... గ్రామస్థులు ఆ కామాంధుడైన హెడ్ మాష్టర్ కి దేహ శుద్ధి చేసి బుద్ధి చెప్పారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read విషాదం:ప్రియురాలిని కాపాడబోయి భర్త మృతి, సూసైడ్ చేసుకొన్న భార్య...

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా పందిళ్లపల్లి హైస్కూల్లోని హెడ్ మాష్టర్ విద్యార్థినుల పట్ల దారుణంగా ప్రవర్తించాడు. విద్యార్థునులను లైంగికంగా వేధించాడు. అతని వేధింపులు తట్టుకోలేకపోయిన బాలికలు విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో... విద్యార్థినుల తల్లిదండ్రులు బుధవారం హెడ్ మాష్టర్ కి దేహశుద్ధి చేశారు. హెడ్ మాష్టర్ ని చితకబాది స్కూల్ లో నుంచి బయటకు గెంటేశారు. అనంతరం స్కూల్ కి తాళం వేశారు.