అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటివరకు గ్రామంలో సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. 

టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి కి గ్రామస్థులు చుక్కలు చూపించారు. లూటుకుర్రులో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటివరకు గ్రామంలో సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. 

రోడ్లు, తాగునీటి ఇబ్బందులతో అనేక అవస్థలు పడుతున్నామని, దీనిని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా గ్రామంలో బాడిలంక ప్రాంతంలో వాటర్‌ట్యాంకుఉండగా, మరో వాటర్‌ట్యాంకును నిర్మించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఆగస్టు నెలాఖరులోపు గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచారు.

అనంతరం గ్రామకూడలిలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, పార్టీ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. గ్రామంలో రూ.9 లక్షలతో నిర్మించిన వంతెన ప్రారంభించారు. బాడిలంక ప్రాంతంలో రూ.27 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న వాటర్‌ట్యాంకుకు శంకుస్థాపన చేశారు