అధికారులను గదిలో నిర్బంధించి ఆగ్రహం చూపిన పల్లె ప్రజలు (వీడియో)

అధికారులను గదిలో నిర్బంధించి ఆగ్రహం చూపిన పల్లె ప్రజలు (వీడియో)

కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ఆముదాలపల్లె లో అధికారులను గదిలో నిర్బంధించి  గ్రామస్థులు తమ నిరసన తెలిపారు.  ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పల్లె నిద్ర’ లో భాగంగా  రెవిన్యూ అధికారులు ఈ గ్రామానికి వచ్చారు.  అయితే, తమకు నివాస స్థలాలు కేటాయించడంలో అలసత్వం వహిస్తున్నారంటూ పల్లె నిద్రకు వచ్చిన తహసీల్దార్ ను వారు ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇది తాహశీల్దార్ కు కోపాన్ని తెప్పించింది. ఆయన వారి మీద చిందులేశారు. అంతే, పని చేయకపోగా కోప తాపాలా అంటూ ఆగ్రహించిన ప్రజలు అధికారులను గదిలో నిర్బంధించి తాళాలు వేసి నిరసన తెలిపారు.

                             

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos