ఏపీలో ఇసుక మాఫీయా రెచ్చిపోతోంది. ఏకంగా ప్రభుత్వోద్యోగులపైనే దాడులకు దిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం గ్రామీణ మండలం నైరలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది మంగళవారం రాత్రి నైర బీసీ కాలనీకి చేరుకున్నారు.

లారీల్లో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అధికారులు అడ్డుకున్నారు. దీంతో నైర గ్రామస్తులు వారిపై కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వరరావుకు గాయాలయ్యాయి.

మిగిలిన ముగ్గురు వీఆర్వోలు దాడి నుంచి తప్పించుకున్నారు. గాయపడిన వారిని శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.