సినిమాల్లో క్రైం సీన్లతో ఇన్స్పైర్ అయ్యి.. సరదాగా వాహనాలు కాల్చేశాడు..
సినిమాల్లో చూసిన క్రైమ్ సీన్స్ పనిచేస్తాయో లేదోనని సరదాగా చేసి చూస్తాడో కేటుగాడు. అలా ఇటీవల విజయవాడలో మూడు బైక్ లు తగలబెట్టాడు. దీనికి తోడు అతను మందు కిక్కులో ఉన్నాడంటే అతని మాట అతనే వినడు. ఆ విచిత్ర వింత నేరస్తుడే మొక్కపాటి ఫణిదుర్గా ప్రసాద్.
సినిమాల్లో చూసిన క్రైమ్ సీన్స్ పనిచేస్తాయో లేదోనని సరదాగా చేసి చూస్తాడో కేటుగాడు. అలా ఇటీవల విజయవాడలో మూడు బైక్ లు తగలబెట్టాడు. దీనికి తోడు అతను మందు కిక్కులో ఉన్నాడంటే అతని మాట అతనే వినడు. ఆ విచిత్ర వింత నేరస్తుడే మొక్కపాటి ఫణిదుర్గా ప్రసాద్.
విజయవాడ, ఆటోనగర్ లో వాహనాల దగ్ధం కేసులో నిందితుడు మొక్కపాటి ఫణిదుర్గా ప్రసాద్. పోరంకి గ్రామం ప్రభునగర్ కి చెందిన ఈ నిందితుడు షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తాను తాగితే ఏం చేస్తానో తనకే తెలియదన్నాడు. అంతేకాదు సినిమాల్లో చూసిన క్రైం సీన్లతోనే ఇలా చేస్తానని చెప్పుకొచ్చాడు.
నిందితుడు ఫణిదుర్గాప్రసాద్‌ను పెనమలూరు సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా సెంట్రల్ ఏసీపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు తెలిపారు.
మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఫణిదుర్గా ప్రసాద్ ప్రభునగర్ లోని తన ఇంటికి వెళ్లడానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో పోరంకి గ్రామంలోని కరణం గారి బజారు వద్ద నిలబడ్డాడు. అక్కడ ఇళ్లముందు పార్కింగ్ చేసిన మూడు మోటార్ సైకిళ్లకు ఉన్న పెట్రోల్ ట్యాంకు పైపులను ఊడదీశాడు.
ఆ తరువాత తన జేబులో ఉన్న లైటర్ తో వాటిని తగులబెట్టాడు. సీసీ ఫుటేజీల ద్వారా నిందితుడిని గుర్తించామని ఏసీపీ యర్రం శ్రీనివాసరెడ్డి చెప్పారు. టూ వీలర్స్ కు మంటలు ఎక్కువ కావడంతో పక్కనే ఉన్న ఇన్నోవా కారు కూడా కాలిపోయింది.
కాలిపోయిన వాహనాల విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితుడు గతంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడని, గత ఏడాది కోవిడ్ కారణంగా ఫణిదుర్గాప్రసాద్ విజయవాడలోని పోరంకి గ్రామం ప్రభునగర్‌కు వచ్చినట్లు ఆయన తెలిపారు.