Asianet News TeluguAsianet News Telugu

టిడిపి హయాంలోని సెక్యూరిటీ అధికారులు...సింహాలను అప్పగించలేదు: దుర్గగుడి ఛైర్మన్

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని ఇంద్రకీలాద్రి ఆలయ ఛైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. 

vijayawada temple chairman reacts chariot lions issue
Author
Vijayawada, First Published Sep 17, 2020, 7:22 PM IST

విజయవాడ: ఇంద్రకీలాద్రి రథం మీద ఉన్న మూడు వెండి సింహాలు మాయమైన విషయంపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ ఈవో సురేష్‌ బాబు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది ఉగాది ఉత్సవాల తర్వాత రథాన్ని బయటకు తీయలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 17 నెలల తర్వాత ఇంజనీరింగ్ పనులు నిమిత్తం పరిశీలిస్తే సింహాలు మాయమైనట్లు వెల్లడయిందని అన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు సింహాలు అపహారణ మాయంపై విచారణ ప్రారంభించారు. 

2018 తరవాత ఇంద్రకీలాద్రి రథాన్ని తీయలేదని ఈవో సురేష్‌బాబు పేర్కొన్నారు. స్టోర్ రూమ్ తాళాలు తన దగ్గర ఉండవని...కాబట్టి సంబంధిత అధికారులను సంప్రదించి స్టోర్ రూమ్‌లో సింహాలు ఉంటాయి అనే ఉద్దేశంతో పరిశీలించాము. కానీ అక్కడ సింహాలు లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేశాము'' అని ఈవో పేర్కొన్నారు. 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని ఇంద్రకీలాద్రి ఆలయ ఛైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఘాట్‌‌ రోడ్‌లో ఉన్న రథాన్ని జమ్మిదిడ్డిలో పెట్టినట్లు, ఆ తరవాత మహామండపం దగ్గరకు తీసుకొచ్చి పెట్టారని తెలిపారు. 2019 లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉగాది వేడుకల్లో ఉపయోగించిన తర్వాత రథాన్ని ఇప్పటివరకు వాడలేదని స్పష్టం చేశారు. అప్పుడు వాడిన తరవాత పట్టా కట్టి ఉంచారో ఇప్పటికి అలాగే ఉంచామన్నారు. 

read more  చర్చిలపై రాళ్లు పడితే అలా, ఆలయాలపై పడితే ఇలా: జగన్ ప్రభుత్వంపై సోము వీర్రాజు

అయితే నిన్న(బుధవారం) కనపడని సింహాలు స్టోర్ట్‌రూమ్‌లో ఉన్నాయో లేవో అని సంబంధిత ఆలయ అధికారులు తనిఖీ చేసినట్లు వెల్లడించారు. అయితే  ఆ సింహాలు స్టోర్ట్‌ రూమ్‌లో లేవని తేలిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సెక్యూరిటి అధికారులు ఇప్పుడు వచ్చిన మాక్స్ సెక్యురిటి వాళ్ళకి ఆ సింహాలు అప్పజెప్పలేదని తెలిపారు. కాబట్టి ఈ రోజు సింహాలు కనపడకుండా పోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

''పోయిన సింహాలు ఏరకంగా పోయాయో దర్యాప్తు చేయాలని పోలీసులను కోరాం. హిందువుల మనోభావాలు కాపాడే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని మాట్లాడారు. గత టీడీపీ-బీజేపీ హయాంలో దేవాలయంలో క్షుద్రపూజలు జరిగినప్పుడు అప్పటి మీ దేవాదాయశాఖ మంత్రి రాజీనామా చేశారా? గత టీడీపీ హయాంలో సుమారు 40 దేవాలయాలు కులగొట్టినప్పుడు ఆ రోజు జనసేన నాయకులు ఎందుకు మాట్లాడలేకపోయారు'' అని సోమినాయుడు నిలదీశారు. 

''ఒక ఎంఎల్సీగా మాట్లాడేటప్పుడు మర్యాద కూడా లేకుండా మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు బుద్ధ వెంకన్న. జరుగుతున్న ఎంక్వైరీలో దోషులు తేలితే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో తప్పులు జరిగాయి అప్పుడు ఎన్ని సార్లు మీ మంత్రులతో రాజీనామా చేయించావు చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని వదంతులు చేసిన ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్ పై అపార నమ్మకం ఉంది'' అని సోమినాయుడు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios