Asianet News TeluguAsianet News Telugu

రూ.లక్ష కరెంట్ బిల్లు ఎగ్కొట్టిన టీడీపీ నేతలు.. యజమాని ఆవేదన

కొన్ని సంవత్సరాలపాటు బిల్డింగ్ ని పార్టీ ఆఫీసులాగా వాడుకున్నారు. వాళ్ల అవసరం అయిపోయాక..  టీడీపీ కనీసం కరెంట్ బిల్లు కూడా కట్టకుండా ఆఫీసుఖాళీ చేసి వెళ్లిపోయారని ఆ భవన యజమాని, ఎన్ఆర్ఐ పొట్లూరి శ్రీధర్ ఆరోపిస్తున్నాడు. 

Vijayawada: TDP fails to pay its office power bills
Author
Hyderabad, First Published May 21, 2019, 11:41 AM IST

కొన్ని సంవత్సరాలపాటు బిల్డింగ్ ని పార్టీ ఆఫీసులాగా వాడుకున్నారు. వాళ్ల అవసరం అయిపోయాక..  టీడీపీ కనీసం కరెంట్ బిల్లు కూడా కట్టకుండా ఆఫీసుఖాళీ చేసి వెళ్లిపోయారని ఆ భవన యజమాని, ఎన్ఆర్ఐ పొట్లూరి శ్రీధర్ ఆరోపిస్తున్నాడు. 

విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న తన స్థలాన్ని  టీడీపీ నేతలు పార్టీ ఆఫీస్ కోసం వాడుకొని, ఖాళీ చేసే సమయంలో కరెంట్ బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయారని శ్రీధర్ మీడియాకి తెలిపారు.2009 లో తన స్థలాన్ని టిడిపి జిల్లా కార్యాలయానికి లీజుకిచ్చానని, లీజు విషయంలో కూడా లక్షలాది రూపాయలు పెండింగ్ పెట్టి,  చివరకు నగరానికి చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలతో టిడిపి నేతలు సెటిల్ చేయించినట్టు శ్రీధర్ అన్నారు.

కరెంట్ బిల్లు లక్షల రూపాయల వరకు బకాయిలు ఉంటే విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు ఎందుకు ఊరుకున్నారో తనకు అర్థం కావడం లేదని  శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు.సాధారణ పౌరులు పది రోజులు లేట్ అయితే ఫీజులు పీక్కు పోయే విద్యుత్ అధికారులు ఈ కార్యాలయానికి ఇన్ని రోజులు  విద్యుత్ సరఫరా ఎలా చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా టిడిపి నేతలు బకాయి విద్యుత్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు శ్రీధర్. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని,  టీడీపీ నేతలపై ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని శ్రీధర్ మీడియాకి తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios