విజయవాడ:  విజయవాడ నగరంలో  ఆన్ లైన్ శృంగారం పేరిట పలువురిని ఓ ముఠా మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్ లైన్ శృంగారం పేరిట పలువురికి వల వేస్తున్నారు. ఫేస్‌బుక్ మేసేంజర్ కి మేసేజ్ లు పంపుతున్నారు. అందమైన అమ్మాయి ఫోటోతో ఫేస్ బుక్ మేసేంజర్ కు మేసేజ్ పంపి చాటింగ్  ప్రారంభిస్తున్నారు.

వాట్సాప్ కాల్  చేస్తారు. ఈ కాల్ చేసే సమయంలో  నగ్నంగా ఉండాలని కోరుతారు. వాట్సాప్ కాల్ చేసే సమయంలో నగ్నంగా ఉన్న వారి వీడియోలను ఫోటోలను రికార్డు చేస్తారు. 

నగ్న వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. తాము అడిగినంతా డబ్బులిస్తేనే  ఈ వీడియోలు, ఫోటోలు ఇస్తామని చెబుతున్నారు.ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వీటిని పోస్ట్ చేస్తామని  బెదిరిస్తున్నారు.

ఈ వేధింపులు భరించలేక నలుగురు విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్లో పలువురు న్యాయవాదులు, విద్యార్ధులు ఉన్నారని సమాచారం. బాధితుల నుండి రూ. 10 వేల నుండి రూ. లక్ష వరకు వసూలు చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.