విజయవాడ: విజయవాడలో ఓ యువతిని నమ్మించి  వ్యభిచార కూపంలోకి నెట్టాడు ఓ దుర్మార్గుడు. పని ఇప్పిస్తామని చెప్పి నమ్మించిన ఆటో డ్రైవర్  రూ. 20 వేలకు  వ్యభిచార గృహనికి విక్రయించాడు.  ఏడాది కాలంగా ఆమె నరకం అనుభవిస్తోంది.  స్థానికుల సహాయంతో ఆమె ఎట్టకేలకు  ఆ నరక కూపం నుండి బయటపడింది. 

ఖమ్మం జిల్లాకు చెందిన  యువతి తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమెను పెదనాన్న చేరదీశాడు. వృద్యాప్యం కారణంగా ఆ యువతిని వృద్దుడికి ఇచ్చి వివాహం  చేశారు.. అయితే ఈ వివాహం ఇష్టం లేని  ఆ యువతి విజయవాడకు పారిపోయి వచ్చింది. విజయవాడ బస్టాప్‌లో యువతిని ఆటోడ్రైవర్  ట్రాప్ చేసి  ఓ మహిళకు రూ. 20వేలకు విక్రయించాడు.

విజయవాడ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో ఆ యువతిని వ్యభిచార గృహంలోనే మగ్గింది.  పలు ప్రాంతాలకు ఆ యువతిని తిప్పి వ్యభిచారం చేయాలని ఇబ్బందిపెట్టినట్టు బాధితురాలు చెబుతున్నారు. ఈ  విషయమై పోలీసులకు పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. 

అయితే స్థానిక మహిళలు ఆమెను కాపాడారు. బాధితురాలితో పాటు స్థానికులు కూడ  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కారణంగా  జక్కంపూడిలో సోదాలు నిర్వహించి వ్యభిచార గృహం నిర్వాహకురాలు శోభారాణిని అదుపులోకి తీసుకొన్నట్టు సీఐ మురళీకృష్ణ చెప్పారు.