విజయవాడలో సినీఫక్కీలో రూ.కోటిన్నర గంజాయి పట్టివేత

Vijayawada police  arrested 6 persons for cannabis smuggling
Highlights

విజయవాడలో సుమారు కోటిన్నర విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో  పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. 


విజయవాడ: విజయవాడలో సుమారు కోటిన్నర విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో  పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. 

ఆదివారం తెల్లవారుజామున విజయవాడ మీదుగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారం అందుకొన్న  డీఆర్ఐ, విజయవాడ పోలీసులు  పకడ్బందీగా నిందితులను అరెస్ట్ చేశారు. రాజమండ్రి నుండి రెండు కార్లలో  గంజాయి అక్రమంగా తరలిస్తున్నారని డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. 

అయితే ఈ సమాచారం అందుకొన్న పోలీసులు రామవరప్పాడు వద్ద  కారును ఆపారు. ఆ కారులో గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. ఈ కారులో ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.అయితే మరో కారు కూడ అదే మార్గం  వచ్చింది. అయితే రామవరప్పాడు వద్ద  పోలీసులను చూసిన నిందితులు కారును ఆపకుండా  వేగంగా వెళ్లిపోయారు.అయితే  నిందితులను విజయవాడ పోలీసులు వెంటాడి ఇబ్రహీంపట్నం వద్ద పట్టుకొన్నారు. 

ఇదిలా ఉంటే మరోవైపు రాజమండ్రి నుండి కంటైనర్‌లో 840 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు.కంటైయినర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  అర(గది)లో  ఈ గంజాయిని తరలిస్తున్నారు.

ఈ రెండు వేర్వేరు ఘటనల్లో సుమారు కోటిన్నరకు పైగా గంజాయిని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. రెండు కార్లు, ఓ కంటైనర్ వాహనంతో పాటు ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.

loader