అమరావతి: విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా మరోసారి రెచ్చిపోయారు. నిన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై ట్విట్టర్ యుద్ధం చేసిన కేశినేని నాని తన రూటు మార్చుకున్నారు. ఈసారి వైసీపీ నేత పివీపీని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ప్రబుద్దుడుతో నీకున్న అక్రమ సంబంధం ప్రజలకి అర్థమైందంటూ చేసిన వ్యాఖ్యలపై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. అంతేకాదు నేను ఎవరికైనా ఏమి అయినా ఇవ్వాలి అని ఎవరి దృష్టికి వచ్చినా నా వద్దకు తీసుకువస్తే నేను చెల్లించడానికి సిద్దంగా వున్నానని వందల సార్లు చెప్పడం జరిగింది. ఎప్పటికీ దానికి నేను కట్టుబడి వున్నాను అంటూ ట్విట్ చేశారు.

మరోవైపు నువ్వు బ్యాంకులకు కట్టవలసిన వేల కోట్లు కడితే దేశానికి మంచి చేసినవాడివి అవుతావు అంటూ ట్వీట్ చేశారు. ప్రబుద్ధుడు తో నీకున్న అక్రమ సంబంధం ప్రజలకి అర్థమయింది అంటూ చురకలు వేశారు.

 

ఇకపోతే అంతకుముందు ఎంపీ కేశినేని నానిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు పీవీపి. బై ద వే ప్రతీసారి కొత్త నిక్కర్ కుట్టించాలన్నా, మీటర్లు మీటర్ల గుడ్డ అసరమయే. అసలే కరువుకాలం అంటూ ట్వీట్ చేశారు.  

ముందు నీది పసుపు నిక్కరో ఖాకీ నిక్కరో తెలుసుకోవయ్యా సామి అంటూ కేశినేని నానిపై సెటైర్లు వేశారు పీవీపీ. సక్రమ సంబధమో లేదో అక్రమ సంబంధమో ప్రజలే తేలుస్తారన్నారు. అటు ఇటు కానోళ్లని మన బెజవాడలో చాలా పేర్లతో పిలుస్తారు. ఆటోనగర్ వెళ్లి అడిగితే చాలా క్లియర్ గా చెప్తారంటూ వీవీపీ ట్వీట్ చేశారు. 

నిన్న మెున్నటి వరకు బుద్దా వెంకన్నపై ఒంటికాలితో లేచిన కేశినేని నాని తాజాగా పీవీపీపై దాడి ఎక్కుపెట్టారు. భవిష్యత్ లో ఈ ట్వీట్ల యుద్ధం ఏలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందో వేచి చూడాలి.