ప్రతి వ్యవస్థలో మంచి చెడులుంటాయని విజయవాడ ఎంపీ కేశినేని నాని  చెప్పారు. చెడుంటే  వ్యవస్థను అంతా  ఒకే గాడిన కట్టకూడదన్నారు.

విజయవాడ: ప్రతి వ్యవస్థలో మంచి చెడులుంటాయని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. వాలంటీర్లలో నలుగురైదుగురు చెడ్డవాళ్లుంటే వ్యవస్థను తప్పుబట్టవద్దని కేశినేని నాని తెలిపారు. బుధవారంనాడు గుడివాడలో విజయవాడ ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కేశినేని నాని కోరారు. ప్రజలకు మంచి చేసే ఏ వ్యవస్థనైనా టీడీపీ స్వాగతిస్తుందన్నారు. అందరినీ విమర్శించడం సరికాదని సలహా ఇచ్చారు.

 చంద్రబాబు హయంలో జన్మభూమి కమిటీలు పనిచేశాయన్నారు.వైసీపీ ప్రభుత్వం వాలంటీర్స్ వ్యవస్థను పెట్టిందన్నారు.వాలంటీర్స్ వ్యవస్థ బాగుంటే కంటిన్యూ చేస్తానని చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని కేశినేని నాని గుర్తు చేశారు. అధికారులైనా, వాలంటీర్లు అయినా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ఎంపీ కేశినేని నాని సూచించారు. ప్రజలకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్టీఆర్, చంద్రబాబు ప్రయత్నించారని ఆయన తెలిపారు.

also read:మహిళల మిస్సింగ్‌కు, అక్రమ రవాణాకు తేడా తెలుసా: పవన్ కు రోజా కౌంటర్

వారాహి యాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశారు. మహిళల అక్రమ రవాణాలో వాలంటీర్ల దోహదపడుతున్నారని వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు ఏపీ రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా విమర్శలు చేశారు.వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మంత్రులు తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకుగాను వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రెండో విడత వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. వారాహి యాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వైసీపీపై ,సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారు.

వాలంటీర్లపై అమ్మాయిల పేరేంట్స్ ఫిర్యాదులు చేస్తున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాన్ నిన్న కూడ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు దేశంలో పనులు జరగలేదా అని ఆయన ప్రశ్నించారు.