విజయవాడ డ్రగ్స్ కేసు: డీటీఎస్ కొరియర్ సంస్థలో మరో ముగ్గురు అరెస్ట్
విజయవాడ డ్రగ్స్ కేసులో కొరియర్ సంస్థకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ లో కొరియర్ సంస్థలో పనిచేస్తున్న ముగ్గురికి చెన్నైలోని అరుణాచలం అనే వ్యక్తితో సంబంధాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
విజయవాడ: Vijaywawada లో Drugs కేసులో కొరియర్ సంస్థకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.Hyderabad లో కొరియర్ సంస్థలో పనిచేస్తున్న శ్యాంసుందర్, ప్రవీణ్ వర్మ, తుమ్మల శ్రీనివాస్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని అరుణాచలంతో ముగ్గురు నిందితులు కుమ్మక్కయ్యారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
విజయవాడలోని కొరియర్ సంస్థ ద్వారా Narcotics డ్రగ్స్ ను సరఫరా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పచ్చళ్ల పేరుతో Australiaకు కొరియర్ పంపారు. అయితే పచ్చళ్ల పేరుతో పంపిన Courier ద్వారా డ్రగ్స్ పంపుతున్నారని పోలీసులు గుర్తించారు. ఈ విషయమై NCB అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నెల 1వ తేదీన విజయవాడలోని డ్రగ్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
ఈ కొరియర్ ను పంపిన వ్యక్తి ఆధార్ కార్డు ఆధారంగా బెంగుళూరు కస్టమ్స్ అధికారులు విచారణ నిర్వహించారు. విజయవాడ లోని కొరియర్ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి ఆధార్ కార్డుతో అస్ట్రేలియాకు కొరియర్ పంపిన విషయాన్ని దర్యాప్తులో గుర్తించారు కస్టమ్స్ అధికారులు. ఈ ఏడాది జనవరి 31 సత్తెనపల్లికి చెందిన ఓ వ్యక్తి పచ్చళ్లు పంపాలని కొరియర్ కార్యాలయానికి వచ్చినట్టుగా కొరియర్ సిబ్బంది కస్టమ్స్ అధికారుల విచారణలో వెల్లడించారు.
అయితే పచ్చళ్ల పేరుతో డ్రగ్స్ ను అస్ట్రేలియాకు ఎవరు పంపారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. విజయవాడలోని కొరియర్ ద్వారా నాలుగు కిలోల నార్కోటిక్స్ డ్రగ్స్ ను తరలించేందుకు పక్కా పథకం ప్రకారంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు.
విజయవాడలోని డీటీఎస్ కొరియర్ నుంచి ఆస్ట్రేలియాకు పంపిన పార్శిల్ ఆస్ట్రేలియాకు బదులుగా పొరపాటున కెనడా చేరింది. అక్కడ కవర్‌పై సరైన స్టిక్కరింగ్ లేకపోవడంతో దానిని తిప్పి పంపించారు. బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఆ పార్శిల్‌ను తనిఖీ చేయగా. అందులో 4,496 గ్రాముల నిషేధిత ‘ఎఫెండ్రిన్’ అనే తెలుపు రంగు డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మరో వైపు విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఉన్న ఐదుగురు వ్యక్తులకు డ్రగ్స్ విక్రయాలతో సంబంధం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్ ద్వారా పరిచయం పెంచుకున్న ఐదుగురు వ్యక్తులు డ్రగ్స్ కొనుగోలు చేసేవారని పోలీసులు కనుగొన్నారు. ఈ నెల 16న వీరిని అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు.
వికాస్ ఇంజనీరింగ్ కళాశాల రోడ్డులో చినకంచి వద్ద ఒక కారులో ఉంటామని చెప్పారు. దీంతో కర్నూలు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముందుగానే అక్కడ మోహరించారు. ఈ క్రమంలోనే యశ్వంత్‌రెడ్డి, ఏకేశ్వరరెడ్డి ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే పోలీసులను గుర్తించిన మరో ముగ్గురు సమీపంలోని తోటల్లోకి పారిపోయారు. ఇక, కర్నూలులో ఉన్న వ్యక్తికి ఈ ఐదుగురు రిటైలర్లుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్‌గా వీరు దందా సాగిస్తున్నారని పోలీసులు కనుగొన్నారు.