టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ఫైర్ అయ్యరు. కుప్పం ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబు ఆరోపించడం ఏంటని ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. వెన్నుపోటుల గురించి చంద్రబాబు చెప్పడమేంటని ఆయన అన్నారు.
పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఎంపీ విజయసాయి రెడ్డి(vijayasaireddy) .. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. ప్రతి పక్ష నేతలపై విమర్శాస్త్రాలను సంధించారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు( chandrababu) ను విమర్శించడంలో ముందుంటారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి చంద్రబాబుపై విరుచుకుపడుతున్న ఈ ఎంపీ, గత కొన్నాళ్లు తన మాటల దాడిని తగ్గించారు. కానీ తాజాగా 'ఐయామ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేసి.. ప్రతిపక్ష నేతపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. టీపీడీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై సెటైర్ల వర్షం కురిపించారు.
వెన్నుపోట్ల పితామహుడు గా చంద్రబాబు నాయుడుని అభివర్ణిస్తూ.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. కుప్పంలో తనకు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబు ఆరోపించడాని తప్పు పట్టారు. వెన్నుపోటుల గురించి చంద్రబాబు మాట్లాడమేంటని ప్రశ్నించారు. “పార్టీ నేతలే కుప్పంలో తనకు వెన్ను పోటు పొడిచారంటూ వెన్నుపోట్ల పితామహుడు చంద్రబాబు వాపోతున్నాడు. కోవర్టులను సహించనంటున్నాడు. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అంటున్నారు కార్యకర్తలు. ఎన్టీఆర్ కు నువ్వు పొడిచిన పోటుతో పోలిస్తే కుప్పానిదీ ఒక పోటా బాబూ? ” అంటూ ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి.
ఇక మరో ట్వీట్.. ఉన్న నలుగురుని కాపాడుకోవడానికి రాజీనామాలకు సిద్ధమా అంటూ చంద్రబాబు మరో నాటకానికి తెరతీశాడంటూ మండి పడ్డారు. 2019 నుంచీ చంద్రబాబువి అన్నీ ఉడతఊపులేనని… తాను, తనవాళ్లతో రాజీనామాలు చేయించి బలమేంటో చూపించుకోవాలి గానీ, మీరు చేస్తే మేం చేస్తామనే మెలికలేంటి? రెఫరెండం కోరితే ఉన్నదీ ఊడుతుంది అని కామెంట్ చేశారు. చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డిపై ఎప్పుడు విమర్శల దాడికి దిగుతారు.
కుప్పం మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో అధికార వైసీపీ గద్దెక్కింది. 1989 నుంచి టీపీడీకి కంచుకోట గా ఉన్నా కుప్పం ను వైసీపీ దక్కించుకుంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 25 వార్డులకు గానూ టీడీపీ 6 వార్డులతో సరిపెట్టుకోవల్సివచ్చింది. 1 వార్డు ఏకగ్రీవం కాగా ఎన్నికలు జరిగిన 24 వార్డుల్లో వైసీపీకి 18 వార్డులు దక్కాయి. దీంతో వైసీపీకి చెందిన డాక్టర్ సుధీర్ కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
Read Also : https://telugu.asianetnews.com/entertainment/actor-simbu-admitted-to-hospital-r3zmr6
దీంతో చంద్రబాబు నాయుడు పార్టీ ప్రక్షళనకు చర్యలను సిద్దమయ్యారు. ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులు, పార్టీ ముఖ్యనేతలతో సుదీర్ఘంగా ఆయన సమీక్షించారు. వైఎస్సార్సీపీ దౌర్జన్యాలకు భయపడి కొందరు, లాలూచీపడి మరికొందరు నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేశారని భావించారు. ఈ క్రమంలోనే నెల్లూర్ నగరంలోని అన్ని డివిజన్ కమిటీలను రద్దు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కోవర్ట్‌గా పనిచేసిన గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలూరి రంగారావులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. మరికొందరి మీద కూడా వేటు తప్పని హెచ్చరించారు. టీడీపీలో కుమ్మక్కు రాజకీయాలు ఇక సాగవని చంద్రబాబు తేల్చి చెప్పారు.
