చంద్రబాబు నాయుడి పేరు చెప్తే విజయసాయిరెడ్డి రూ.25 కోట్లు ఇస్తామన్నారు - మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్
ఏపీ సీఎం జగన్ కళ్లలో సంతోషం చూసేందుకే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. సీఐడీ 20 నెలల పాటు జరిపిన దర్యాప్తులో 32 మంది బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలు పరిశీలించిందని, కానీ అందులో ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నుంచి వచ్చిందని గుర్తించలేకపోయారని తెలిపారు.

టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని ఇరికించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమెన్స్ కేసులో టీడీపీ అధినేత పేరు చెప్పాలని, అలా చేస్తే రూ.25 కోట్లు ఇస్తామని విజయసాయిరెడ్డి పూణెకు వెళ్లి పైరవీలకు పాల్పడ్డారని తెలిపారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో భాగమే అని అంగీకరించిన యూఏఈ.. పాకిస్థాన్ కు సందేశం..
ఆయన ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ అరెస్టు అయిన వారిలో ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడి పేరు చెప్పేందుకు ఒప్పుకోలేదని దూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. టీడీపీ అధినేతకు, తమకు ఎలాంటి సంబంధమూ లేదని తేల్చి చెప్పారని అన్నారు. ఏపీ సీఐడీ కూడా 20 నెలల పాటు జరిపిన దర్యాప్తులో గుజరాత్, తమిళనాడు, ముంబాయి, పూణెకు వెళ్లిందని ఆయన అన్నారు. వారు అదుపులోకి తీసుకున్న 32 మంది బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన లావాదేవీలను పరిశీలించారని తెలిపారు. కానీ అందులో ఒక్క రూపాయి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నుంచి వచ్చిందని గుర్తించలేకపోయారని నరేంద్ర కుమార్ అన్నారు.
మూడో కాన్పులోనూ ఆడపిల్లే జన్మించిందని.. కసాయిగా మారిన కన్నతండ్రి.. ఏం చేశాడంటే ?
కేవలం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కళ్లలో సంతోషం చూసేందుకు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. డిజైన్ టెక్ సంస్థకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారని, అయితే వాటిని హైకోర్టు విడుదల చేసిందని నరేంద్ర కుమార్ గుర్తు చేశారు. డిజైన్ టెక్ ఏపీలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ సెంటర్లు, వారు అందించిన పరికరాల వివరాలను ఏపీ హైకోర్టు అందజేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడికి నగదు వచ్చిందని తమ విచారణలో ఎక్కడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించలేదని చెప్పారు.
చంద్రబాబు బాగానే ఉన్నారు.. ఆందోళన చెందవద్దు - భువనేశ్వరికి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్..
ఈ మీడియా సమావేశం సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సీఐడీ చీఫ్ సంజయ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లపై కూడా విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడి ప్రతిష్టను చెడగొట్టాలనే ఉద్దేశంతోనే వారిద్దరూ అసత్యాలు వల్లిస్తున్నారని ఆరోపించారు.
సీఐడీ చీఫ్ ప్రభుత్వ ఉద్యోగా ? లేక అధికార వైఎస్సాఆర్ కార్యకర్తనా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడి అరెస్టును నిరసిస్తూ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో యువత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతోందని అన్నారు. దీనిని గమనించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెమటలు పట్టాయని విమర్శించారు. అందుకే సీఐడీ చీఫ్ ను, అడ్వకేట్ జనరల్ ను హైదరాబాద్ కు పంపించిందని ఆరోపించారు. కానీ అక్కడ వారు మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయారని విమర్శించారు.