ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటి నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు చంద్రబాబుపై ట్వీట్టర్‌ ద్వారా విమర్శల వర్షం కురిపించిన ఆయన తాజాగా వైఎస్ పరిపాలన ప్రారంభమయ్యిందంటూ ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో నవ శకం మొదలైంది. యువకుడైన జగన్ గారి నేతృత్వంలో  అవినీతికి ఆస్కారం లేని, బాధ్యతాయుత, పారదర్శక ప్రభుత్వం ఏర్పడింది. స్వచ్ఛమైన పాలనతో ప్రజల కష్టాలను తొలగించేందుకు నిరంతరం శ్రమిస్తారాయన.

ప్రజల ఆకాంక్షలను నేరవేర్చడమే ఆయన ప్రధాన ఎజెండా అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ జగన్. శుక్రవారం ఉదయం పెన్షన్ పెంపుకు సంబంధించి జగన్ ప్రభుత్వం తొలి జీవో విడుదల చేసింది.