అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి ఈసారి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావును టార్గెట్ చేశారు. గంటా శ్రీనివాసరావుపై ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు 

సైకిళ్ల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని, ఆయన అన్నారు. రూ.12 కోట్ల కొనుగోళ్లలో రూ.5 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. తుప్పు సైకిళ్లపై గుంటా శీను ఘనఘనా అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

ఎస్కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టులో పెట్టినా బ్లాక్ మనీ కోసం తెగ కొట్టేశాడని ఫిర్యాదులు వెల్లువెత్తాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో పిల్లలకు పంపిణీ చేసిన సైకిళ్ల కొనుగోళ్లలో అవినీతిని విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. విజయసాయి రెడ్డి ట్వీట్ ను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు.