Asianet News TeluguAsianet News Telugu

జగన్ ను అభిమన్యుడిలా మట్టుబెట్టాలని చూసిన విషనాగు చంద్రబాబు: విజయసాయి రెడ్డి

జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అఖండ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ జెండాను ఎగురవేసిన సందర్భాన్ని పురస్కరించుకొని వైసీపీ రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తన మనోగతాన్ని పంచుకున్నాడు. చంద్రబాబును విషనాగుతో పోలుస్తూ.... పచ్చ పార్టీని పాతాళానికి జగన్ తొక్కిన రోజని ఆయన తనదైన స్టైల్ లో ట్వీట్ చేసారు. 

VIjayaSai Reddy Fires on Chandrababu on the occassion of YCP's first anniversary after coming to power
Author
Amaravathi, First Published May 23, 2020, 4:02 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నేటికి సంవత్సరం పూర్తయిన విషయం తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అఖండ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ జెండాను ఎగురవేసింది. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులంతా సంబరాల్లో మునిగిపోయారు. నిన్నటి నుండే సోషల్ మీడియాలో వైసీపీ కి సంబంధించిన ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. 

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వైసీపీ రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తన మనోగతాన్ని పంచుకున్నాడు. చంద్రబాబును విషనాగుతో పోలుస్తూ.... పచ్చ పార్టీని పాతాళానికి జగన్ తొక్కిన రోజని ఆయన తనదైన స్టైల్ లో ట్వీట్ చేసారు. 

"ఏడాది క్రితం ఇదే రోజు, ‘ఫ్యాన్’ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసింది. ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జననేత జగన్ గారు. తన వెంట నడిచిన ప్రజల కోసం ‘పది తలల విషనాగు’తో పోరాడారాయన. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు." అని ట్వీట్ చేసారు. 

ఇక నేటి ఉదయమే మరో ట్వీట్లో... 9 సంవత్సరాలపాటు జగన్ ని ఎన్నివిధాలుగా ఇబ్బందులకు గురిచేసారో చెప్పుకొస్తూ... జగన్ ని అభిమన్యుడిలా ఒంటరివాడిని చేసి మట్టుపెట్టాలని చూసినా, జగన్ గుండె ధైర్యం ముందు వారు నిలవలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. 

"తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు. జైలుకు పంపడం. అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్చులు వేశారు. ఆ గుండె ధైర్యం, పట్టుదలల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు. ప్రజలకు జీవితకాల భరోసాగా నిల్చాడు యువనేత." అని ఆయన రాసుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios