టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ శ్రీనీవాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలను కాంగ్రెసు సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు అంటగట్టి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటిలో జరిగిన ఐటీ సోదాలను కాంగ్రెసు సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు లింక్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

బాబు వెళ్లి కలిసిన వారంతా నడినెత్తిన శని తాండవం చేసినట్లు గిలగిలా కొట్టుకుంటున్నారని ఆయన అన్నారు. తీహార్ జైలుకెళ్లినవారు, ఐటీ, ఈడీ నోటీసులు అందుకున్న పెద్దలు సారు స్పర్శ కరోనా వైరస్ కన్నా పవర్ ఫుల్ అని నిర్ధారించారని ఆయన అన్నారు. అహ్మద్ పటేల్ వంటి ఉద్ధండులకూ హవాలా ఉచ్చు బిగిసిందంటే మామూలు విషయమా అని ఆయన సెటైర్లు వేశారు. 

Scroll to load tweet…

ఇదిలావుంటే, చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రపై కూడా విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రజా చైతన్య యాత్రకు టీడీపీ కార్యకర్తల నుుంచి కూడా స్పందన రావడం లేదని ఆయన అన్నారు. చప్పట్లు కొట్టాలని చంద్రబాబు ప్రాధేయపడుతుంటే జాలేస్తోందని ఆయన అన్నారు. 

గట్టిగా చప్పట్లు కొట్ిట తనను ఉత్సాహపరచాలని 70 ఏళ్ల వయస్సులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుందని, కార్యకర్తలు మరీ స్పందన లేకుండా పారిపోతే ఎలా అని, అడిగినందుకైనా కాసుపే క్లాప్స్ కొట్టవచ్చు కాద అని చివరకు స్లోగన్స్ ఇచ్చి అందరూ తనతోనే ఉన్నారని భ్రమపడి ఇంకో చోటికి బయలుదేరుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. 

Scroll to load tweet…