విజయనగరం జిల్లాలో టీడీపీకి మరో షాక్ తలిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పడాల అరుణ పార్టీకి రాజీనామా చేసి, గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపారు. 

పడాల అరుణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. గత 33 యేళ్లుగా టీడీపీలోనే ఉన్నారు. అయితే టీడీపీలో ఇన్నేళ్లుగా పనిచేసినా పావుగ వాడుకున్నారే తప్ప సరైన గుర్తింపు ఇవ్వలేదని అరుణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల పార్టీలో వస్తున్న మార్పులు, పట్టించుకోకపోవడం లాంటి కారణాల వల్లే తాను పార్టీలో ఇమడలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు పడాల అరుణ అంటున్నారు.