విజయవాడ: దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి రోజుకి 10 వేల మందికి మాత్రమే అనుమతించనున్నట్లు విజయవాడ దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. రోజూ ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతివ్వనున్నామని... కేవలం మూల నక్షత్రం రోజు తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి  అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

ఉచిత దర్శనానికి 4వేల టికెట్లు, 100 రూపాయల టికెట్ కు 3 వేల టికెట్లు,  300 రూపాయలకు 3వేల టికెట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. టైం స్లాట్ ప్రకారం భక్తులు దర్శనానికి రావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో 5 ఏళ్ళ లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు దర్శనానికి అనుమతిచ్చేది లేదని అన్నారు.

read more  అంతర్వేది ఘటన ఆ మతాల కుట్రేనని అనుమానం: బిజెపి ప్రధాన కార్యదర్శి సంచలనం (వీడియో)

కోవిడ్ నేపద్యంలో తలనీలాలు సమర్పణ రద్దు చేసామన్నారు. వినాయక టెంపుల్ నుండి ఘాట్ రోడ్ మీదుగా క్యూ లైన్ ద్వారా భక్తులు రావాలని... ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి దర్శనానికి రావాలని సూచించారు.