మొన్నటి వరకూ రోడ్డు విస్తరణలో షాపులు, ఇళ్లు కోల్పోయిన వారు నిరసన తెలిపారు. మంగళవారం మధ్యహ్నం కేశవరెడ్డి విద్యాసంస్ధల అధినేత కేశవరెడ్డి బాధితుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కేశవరెడ్డి-ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి స్వయానా వియ్యంకులు. అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున ఫిరాయింపు మంత్రే కీలకంగా ఉన్నారు.

నంద్యాల ఉపఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ ప్రభుత్వ బాధితులు ఒక్కొక్కరుగా రోడ్డెక్కుతున్నారు. మొన్నటి వరకూ రోడ్డు విస్తరణలో షాపులు, ఇళ్లు కోల్పోయిన వారు నిరసన తెలిపారు. మంగళవారం మధ్యహ్నం కేశవరెడ్డి విద్యాసంస్ధల అధినేత కేశవరెడ్డి బాధితుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కేశవరెడ్డి బాధితులు నియోజకవర్గంలో వేలల్లో ఉన్నారు. కర్నూలు జిల్లాకే చెందిన కేశవరెడ్డి విద్యార్ధుల తల్లి, దండ్రుల నుండి డిపాజిట్ల పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన సంగతి తెలిసిందే కదా? విద్యార్ధులు 10వ తరగతి అయిపోయిన తర్వాత డిపాజిట్ డబ్బును వడ్డీతో సహా తిరిగిస్తానని చెప్పి సుమారు రూ. 800 కోట్లు వసూలు చేసారట.

సరే, డిపాజిట్ చేసిన తర్వాత ఎవరికీ ఒక్క రూపాయి కూడా వెనక్కివ్వలేదు. ఇదంతా జరిగి సుమారు నాలుగేళ్ళయిందిలేండి. అప్పటి నుండి బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నేరం రుజువవ్వటంతో రెడ్డి మాత్రం హాయిగా జైలులో ఉన్నారు. ఇంతకీ ఉపఎన్నికలకు బాధితుల ర్యాలీకి ఏమిటి సంబంధమో అర్ధం కావటం లేదా? కేశవరెడ్డి-ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి స్వయానా వియ్యంకులు.

అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున ఫిరాయింపు మంత్రే కీలకంగా ఉన్నారు. ఈ సమయంలో పది ఓట్లుంది అనుకున్న ప్రతీ ఒక్కరినీ టిడిపి వాటేసుకుంటోంది. అందులో భాగంగానే కేశవరెడ్డి బాధితుల్లో కొందరిని చంద్రబాబునాయుడుతో నేరుగా కలిపారు. వారికి కేశవరెడ్డి ఇవ్వాల్సిన డబ్బు టిడిపి ఇచ్చేట్లు, అందుకు బాధితులు టిడిపికి పనిచేసేట్లు ఒప్పందం జరిగిందట.

ఎప్పుడైతే ఆ విషయం బయటపడిందో బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎందుకంటే, టిడిపి డబ్బు సర్దుబాటు చేయగలిగింది కొందరికే. కానీ బాధితులు సుమారు 30 వేలమందున్నారు. దాంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు పట్టణంలో బాధితులు భారీర్యాలీ నిర్వహించారు. దాంతో టిడిపికి ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కావటం లేదు. ఒకవైపు రోడ్డు విస్తరణలో భాగంగా షాపులు, ఇళ్లు కోల్పోయిన వారు నిరసన తెలుపుతున్నారు.