చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు

First Published 23, May 2018, 12:34 PM IST
venkateswara ornaments hid chandrababu residences says vijayasa
Highlights

సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి .

 

తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, హైదరాబాద్‌లలోని ఆయన నివాసాలకు తరలించారంటూ బుధవారం వైఎస్సార్‌ సీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ  లేదా తెలంగాణ పోలీసులతో చంద్రబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయపడతాయని ఆయన వ్యాఖ్యానించారు.

12 గంటల కంటే ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇస్తే తిరుమల ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయని అన్నారు. కేవలం హెరిటేజ్‌ వ్యాపారంతోనే చంద్రబాబు ఇన్ని ఆస్తులు కూడబెట్టారంటే సాధ్యమైన పని కాదని ఆయన చెప్పారు.చంద్రబాబు ఇంట్లో ఆభరణాలు బయటపడకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 

 

loader