కడప:వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. పట్టా విరిగిపోవడంతో రైలును పట్టాలపై నిలిపివేశారు. పట్టా విరిగిన విషయాన్ని సకాలంలో గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కడప జిల్లా ఓబులవారిపల్లె వద్ద  రైలుపట్టా విరిగినట్టుగా గుర్తించారు. రైలును నిలిపివేసి పట్టాను మరమ్మత్తులు చేశారు.

Also read:జేబీఎస్ టూ ఎంజీబీఎస్ ‘మెట్రో’కు సేఫ్టీ కమీషన్ అనుమతి, ఇక పరుగులే

పట్టాను మరమ్మత్తు చేసిన తర్వాతే రైలును ముందుకు వెళ్లనిచ్చారు.  రైల్వే సిబ్బంది సకాలంలో కడప జిల్లా ఓబులవారిపల్లె వద్ద పట్టా విరిగి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే రైల్వే సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఆధారంగా రైలును పట్టా విరిగిన ప్రాంతానికి ముందే నిలిపివేశారు.

రైలు పట్టాలను మరమ్మత్తు చేసేవరకు ప్రయాణీకులు ఎదురు చూశారు. పట్టాను మరమ్మత్తు చేసిన తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలును ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.